కొన్ని సినిమాలకు చిత్రీకరణ దశలో పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ఆ మూవీ టీజర్ లేదా ట్రైలర్ లేదా ఆ మూవీ లోని పాటలు విడుదల అయినప్పుడు అవి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న నేపథ్యంలో ఆ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్ ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకొని ప్రస్తుతం మూవీపై అదిరిపోయే అంచనాలను ఏర్పరచిన సినిమా మ్యాడ్. ఈ మూవీ కి సంబంధించిన టీజర్ విడుదల కాకముందు ఈ మూవీ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 

అలాంటి సమయం లోనే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఆ తరువాత ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్ లో ఈ సినిమా కనుక జాతి రత్నాలు మూవీ కంటే ఒక్క శాతం తక్కువ నవ్వించింది అని మీకు అనిపించిన నాకు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అయినా మెసేజ్ పెట్టండి మీ టికెట్ డబ్బులు మీకు వెనక్కు ఇప్పిస్తాను అని చెప్పడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల కంటే ఒక రోజు ముందుగానే ఈ మూవీ కి సంబంధించిన స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 5 వ తేదీన కొన్ని ఏరియాల్లో ప్రదర్శించబోతున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 5 వ తేదీన హైదరాబాద్ , వైజాగ్ , విజయవాడ , నెల్లూరు , తిరుపతి , రాజమండ్రి , కాకినాడ , గుంటూరు విలేజ్ లలో ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: