బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు అనేవి చాలా సర్వసాధారణ విషయం. ప్రతి సీజన్ లో కూడా కొన్ని జంటలు లవ్ ట్రాక్ లను నడిపి జనాల దృష్టిని తమ వైపు మళ్ళించుకున్న వారు ఉన్నారు. ఇకపోతే ఈ సీజన్ ప్రారంభంలో పల్లవి ప్రశాంత్, రతిక లవ్ ట్రాక్ ను మొదలు పెట్టారు. ఇక వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు ప్రేమకు సంబంధించిన వ్యవహారాలను మాట్లాడుతూ ప్రేక్షకుల దృష్టిని తమ వైపు మళ్లించుకున్నారు. ఇక ఆ తర్వాత వీరిద్దరికి గొడవలు జరిగాయి. అలాగే రతిక కూడా హౌస్ నుండి వెళ్ళిపోయింది. ఇక అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 లో ఫ్రెష్ గా మరో లవ్ ట్రాక్ మొదలు అయింది. ఆ లవ్ ట్రాక్ మరేవరిదో కాదు డాక్టర్ బాబు గౌతమ్... శుభశ్రీ లది... ఈరోజు ఎపిసోడ్‌లో స్టార్టింగ్ లోనే వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలను చూపించారు.

అందులో వీరిద్దరూ నేను మాట్లాడితే నచ్చడం లేదా..? నీకు మెంటల్‌లా కనిపిస్తున్నానా.. అంటూ సుబ్బు కిచెన్‌లో గౌతమ్‌తో మాట్లాడింది. దీనికి గౌతమ్ ఓర కంట చూస్తూ నచ్చుతుంది కాబట్టే కదా లాయలిటీ ఉంది.. అందుకే నిన్ను భరిస్తున్నా అని అన్నాడు. దీనికి సుబ్బు "ఏం లాయలిటీ.. అని సిగ్గుపడుతూ అడగగా ఎన్ని లాయలిటీలు ఉంటాయే.. ఇచ్చిన మాట మీద నిలబడటమే లాయలిటీ అని చెప్పాడు. ఆ తర్వాత మొన్న అన్నదానికి నేను హర్ట్ అయ్యా.. కంటెండర్‌గా నేను-ప్రిన్స్‌లో ఎవరు డిజర్వ్ అని అడిగితే నువ్వు ఎందుకు సెలక్ట్ చేయలేకపోయావ్ అంటూ గౌతమ్ ,సబ్బు ను అడిగాడు. దీనికి సుబ్బు ఒక చిరునవ్వు ఇచ్చింది. ఇప్పుడు అడుగుతున్నా చెప్పు.. చెప్పకపోతే నేను హర్ట్ అవుతా అంటూ గౌతమ్ అన్నాడు. ఏంట్రా బాబూ అందరి మనోభావాలు నేనే దెబ్బతీస్తున్నానా.. అంటూ తనకి వచ్చిన తెలుగులో సుబ్బు అనేసి ముందుకు నడిచింది. దీంతో కావాలని సేఫ్ గేమర్.. అంటూ సబ్బు ను గౌతమ్ ఏడిపించాడు. ఏయ్.. ఏంటి  అంటూ సుబ్బు కోపపడితే ఒక హగ్ ఇచ్చి నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్.. నీ గురించి నేను ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడను అంటూ గౌతమ్ అన్నాడు. ఇక వీరి ప్రేమ ముచ్చట్లు ముగిసిన తర్వాత బిగ్ బాస్ మీరు ఈ హౌస్ లో ఎవరితో అయితే చాలా స్నేహంగా ఉంటున్నారు..? మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారో వారిని సెలెక్ట్ చేసుకోండి అని ప్రకటించాడు.

దీనితో హౌస్ మేట్స్ అంతా తమకు నచ్చిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాసెస్ లో ఇప్పటికే గౌతమ్, శుభ శ్రీ ఇద్దరు కలిసి గేమ్ ఆడాలి అని ఫిక్స్ అయ్యారు. అని హౌస్ మేట్స్ అంటుండగా అది విన్న సందీప్.. మీరు ఫిక్సయ్యారా.. అంటూ అడిగాడు. వాళ్లు ఆల్ రెడీ కన్ఫార్మ్‌డ్ కపుల్.. ఎప్పుడో ఫిక్స్ అంటూ అమర్ ఓ రాయి వేశాడు. ఇలా ఫ్రెష్ గా స్టార్ట్ అయిన ఈ ప్రేమాయణం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: