బిగ్ బాస్ సీజన్ 7 ఐదవ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ కాబోయే కంటెస్టెంట్ కి సంబంధించిన నామినేషన్ లలో ప్రియాంక , శివాజీ, యావర్, తేజ, అమర్ దీప్, గౌతమ్, శుభశ్రీ లు నిలిచారు. ఇక ఇందులో పోయిన వారం జరిగిన టాస్క్ లో తేజ, గౌతమ్ తో వ్యవహరించిన తీరు పట్ల నాగార్జున గారు అతన్ని డైరెక్టుగా నామినేట్ చేయడంతో ఎవరు కూడా తేజను నామినేట్ చేయాల్సిన పనిలేదు అని బిగ్ బాస్ సూచించాడు. ఇక తన దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని మిస్ యూస్ చేసినట్లుగా చాలా మంది హౌస్ మేట్స్ భావించడంతో శివాజీ కూడా ఈసారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటాడు అని బిగ్ బాస్ సూచించాడు.

ఇక ఈ వారం నామినేషన్ లో నిలిచిన కంటెస్టెంట్లలో కొంతమందికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంటే మరి కొంత మందికి మాత్రం జనాల నుండి పెద్దగా రెస్పాన్స్ లభించడం లేదు. ఇక ఈ వారం నామినేషన్ లలో ఉన్న కంటెస్టెంట్ లలో ఇప్పటివరకు ఎవరికి ఎంత శాతం ఓట్లు పడ్డాయి అనే విషయాలను తెలుసుకుందాం. తన పవర్ మిస్ యూస్ చేశాడు అని నామినేషన్ ప్రక్రియలోకి ఎంట్రీ ఇచ్చి చాలామందితో నామినేట్ అయిన శివాజీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటూ ఇప్పటికే 38.16 శాతం ఓట్లను దక్కించుకున్నాడు.

ఇక ఆ తర్వాత ప్రిన్స్ 12.77 శాతం ఓట్లతో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా.. శుభశ్రీ 12.17శాతంతో మూడవ స్థానంలోనూ, అమర్ దీప్ 11.72 శాతంతో నాలుగవ స్థానంలో, టేస్టీ తేజ 8.64 ఓట్ల శాతంతో ఐదవ స్థానంలోనూ, ప్రియాంక 8.27 ఓట్ల పర్సెంటేజ్ తో ఆరవ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ వారం హౌస్ నుండి ప్రియాంక లేదా గౌతమ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వచ్చే రోజుల్లో వీరు తమ ఆటతో ప్రేక్షకులను అలరించి తమ ఓట్ల శాతాన్ని పెంచుకుంటారు లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: