సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో.. ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మారుతుంది అని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే స్టార్లు అవుతారు అనుకున్న వారు సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా పోతూ ఉంటారు. ఇక వీళ్ళు ఎప్పటికి స్టార్లు కాలేరు అనుకున్న వాళ్ళు కొన్ని సినిమాలతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోలుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా స్టార్ హీరో అవుతాడు అనుకుంటే ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోలలో తరుణ్ కూడా ఒకడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైం లోనే స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.


 లవర్ బాయ్ అనే ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక తరుణ్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పాలి. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను లాంటి సినిమాలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులు టీవీలలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అలాంటి హీరో ఆ తర్వాత కాలంలో మాత్రం ఇక అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. తరుణ్ రీఎంట్రీ ఉంటుందని వార్తలు రావడం తప్ప అది మాత్రం జరగడం లేదు అని చెప్పాలి. ఇప్పుడు తరుణ్ గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా పాన్ ఇండియా ఆఫర్ తరుణ్ తలుపు తడితే అతను రిజెక్ట్ చేశాడట.


 హీరో తరుణ్ దగ్గరికి వెళ్లి ఒక డైరెక్టర్ పాన్ ఇండియా కథను వినిపిస్తే కథలో హీరో రోల్ అయితేనే చేస్తాను అని తరుణ్ కండిషన్ పెట్టాడట. వేరే క్యారెక్టర్ అయితే చేయను అంటూ మొఖం మీద చెప్పేశాడట. హీరోకి తమ్ముడి పాత్రలో చేయాలంటూ ఆ డైరెక్టర్ తరున్ తో చర్చలు జరిపాడట. అయితే డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిన తరుణ్ ఒప్పుకోకపోవడంతో ఇక ఆ పాత్ర కోసం వేరే నటుడుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా తరుణ్ మిస్ చేసుకున్న ఈ సినిమా ఏకంగా 100 కోట్లు క్రాస్ చేసిందట  ఇక ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారడంతో తరుణ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: