
దీంతో ఉల్టా ఫుల్టా అని చెప్పారు కదా మధ్యలో బిగ్ బాస్ నిర్వహకులు ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అని అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చేవారం నుంచి బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ కానుంది అన్నది తెలుస్తుంది. ఈ గ్రాండ్ లాంచ్ లో వచ్చే జాబితా ఉల్టా ఫుల్టా అయింది. మొదటినుంచి ఈ సీజన్లో ఉల్టా ఫుల్టా అంటూ రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అక్టోబర్ ఏడవ తేదీన బిగ్బాస్ 2.0 షూటింగ్ జరగబోతుంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ వస్తున్నట్లు పేర్లు వచ్చాయి.
అయితే యాంకర్ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చిన ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ రావట్లేదట. ఇక బిగ్ బాస్ 2.0 లోకి అడుగు పెట్టే వారిలో సీరియల్ నటుడు అంబటి అర్జున్, అంజలి పవన్, బోలే శవాళి, పూజ మూర్తి, కెవ్వు కార్తిక్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి మరి కొంతమంది యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే దాదాపు నాలుగు వారాలపాటు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గేమ్ స్ట్రాటజీలను చూసిన ఈ బయట ఉన్న కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఆటను కొనసాగిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.