తమిళంలో స్టార్ హీరోగా పేరుపొందిన రజనీకాంత్ జ్యోతిక, నయనతార కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం చంద్రముఖి.. ఈ చిత్రాన్ని వాసు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ ని చాలా సంవత్సరాల తర్వాత తెరకెక్కించడం జరిగింది. చంద్రముఖి-2 పేరుతో డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించారు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించింది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.


ఇక పోతే ఈ సినిమా స్ట్రిమింగ్ హక్కులను ఓటిటి ప్రముఖ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా రూ .8 కోట్ల రూపాయలకు ఓటీటి రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్ట్రిమ్మింగ్ పైన  45 రోజుల  తర్వాత ఈ సినిమాని ఓటీటి లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉపయోగించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నట్లుగా తెలుస్తోంది.


మరొకవైపు ఈ సినిమా కోసం రాఘవ లారెన్స్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి హర్రర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో సీనియర్ నటులు కీలకమైన పాత్రలో నటించారు పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అధికారికంగా ఓటీటి డేట్ ని సైతం చిత్ర బృందం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కంగనా రనౌత్ కూడా ఈ సినిమా పైన భారీగానే ఆశలు పెట్టుకుంది కానీ ఆశలన్నీ నిరాశలు గాని మిగిలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: