ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. కాగా ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ శ్రీ లీల చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నాకు ఆఫర్ వచ్చిందని తెలిసి కొంతమంది నాకు పర్సనల్గా కాల్ చేసి ఆ సినిమాలో నటించొద్దు అని చెప్పారు అంటూ శ్రీ లీల చెప్పుకొచ్చింది. శ్రీ లీల ఇలా చెప్పడంతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ప్రస్తుతం హీరోయిన్గా వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఇలా కూతురు పాత్రలో ఎందుకు నటించడం.. ఈ సినిమా చేయవద్దు.. నో చెప్పు అని చాలా మంది చెప్పారు. కానీ హీరోయిన్గా ఇది కాకపోతే ఇంకో ఆఫర్ రావచ్చు. కానీ నా లైఫ్ లో ఇలాంటి పాత్రలు వదులుకుంటే మళ్ళీ వస్తాయో లేదో తెలియదు. అందుకే వచ్చినప్పుడు ఓకే చెప్పేసా అంటూ చెప్పుకొచ్చింది ఇక శ్రీలీల. కాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా భగవంతు కేసరి సినిమాలో బాలయ్య శ్రీ లీల మధ్య తండ్రి కూతుర్ల ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయింది అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి