
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇక పోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నితిన్. నితిన్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ క్రేజ్ తన సినిమాల ఉపయోగించుకోవడం గురించి పలు రకాల ప్రశ్నలు మొదలయ్యాయి.. అయితే ఇలాంటి ప్రశ్నలకు నితిన్ సమాధానం తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ని నేను వాడడం ఏంటి ఆయనకు నేను పెద్ద అభిమానిని ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు తెలియజేశానని కూడా తెలియజేశారు నితిన్.
పవన్ కళ్యాణ్ ను నాకంటే ఎక్కువగా చాలా మంది తమ సినిమాలకు వాడుకున్నారని అయితే ఈ విషయాన్ని ఎవరు కూడా పైకి చెప్పారని.. కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్న ఎదురు కాక అందుకునే పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కాస్త స్ట్రాంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ఎవరు సపోర్టు కూడా అవసరం లేదని కాకపోతే మోరల్ గా మా సపోర్ట్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంటూ నితిన్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం నితిన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి నితిన్ నటించిన సినిమా సక్సెస్ అయి క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి మరి.