టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందులో ఒక కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీ లో కూడా విడుదలై అక్కడ కూడా దూసుకుపోతోంది. ఈ సినిమాతో పాటు మరొకవైపు కాజల్ భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తోంది. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కూడా కనిపించబోతోంది.

అయితే విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకొని మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కాజల్. సత్యభామ అనే సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచుట్టించింది కాజల్. మేజర్ సినిమా నాకు బాగా నచ్చింది. చూసిన వెంటనే ఈ సినిమా దర్శకుడు శశికిరణ్ తో కలిసి ఒక సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో కాకపోయినా స్క్రీన్ ప్లే అందిస్తూ సమర్పికులుగా వ్యవహరిస్తున్న సత్యభామ సినిమాలో భాగమవడం నాకు చాలా సంతోషంగా ఉంది.

 శశి కిరణ్‌ చెప్పిన కథ విని నేను ఆశ్చర్యపోయా. కచ్చితంగా ఈ సినిమాలో నటించాలని ఫిక్స్‌ అయిపోయి హైదరాబాద్‌కు వచ్చేశా. అప్పటి నుంచి కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నా. బాబును చూసుకుంటూ షూటింగ్స్‌కు హాజరవుతున్నా. 'సత్యభామ' కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకుని యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటిస్తున్నా. ఇంతకుముందు నేను నటించిన సినిమాలన్నీ ఒకెత్తు.. ఈ సత్యభామ ఒకెత్తు. చిత్రీకరణ దాదాపు 65 శాతం పూర్తయింది'' అని కాజల్‌ వివరించారు. అలా ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమాపై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: