టాలీవుడ్ లో ప్రెజెంట్ మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సీనియర్, స్టార్ హీరోలనే తేడా లేకుండా ఇప్పటికే చాలామంది మల్టీ స్టారర్ సినిమాలు చేసి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ ఇద్దరు కలిసి 'RRR' సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్రాజెక్టు రాబోతుందట. అది కూడా మెగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కావడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మెగా మల్టీ స్టారర్ గురించి అదిరిపోయే హింట్ ఇచ్చారు. 

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్ తాజా గా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్లో ఓ మెగా అభిమాని చిరు, చరణ్ లతో మీరు సినిమా చేస్తారా? అని అడిగితే అందుకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు హరీష్ శంకర్. చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే ఆచార్య మూవీలో సందడి చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. అదే సినిమా సక్సెస్ అయి ఉంటే ఈపాటికి వీరి కాంబోలో మరో మూవీ రెడీ అయి ఉండేది. సక్సెస్, ఫెయిల్యూర్స్ ని పక్కన పెడితే మరోసారి ఈ తండ్రి, 

కొడుకులు కలిసి నటిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే ప్రశ్న అభిమాని అడిగితే హరీష్ శంకర్ చిరు, చరణ్ తో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో మెగా మల్టీస్ స్టారర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా తానే హింట్ ఇవ్వడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. మెగా హీరోలతో సినిమాలు చేయడం హరీష్ కి కొత్త కాదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలతోనూ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: