రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా సందీప్ రెడ్డి వంగా కాంబోలో  స్పిరిట్ అనే సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రివీల్ చేయకపోయినా ఆయన సన్నిహితుల ద్వారా స్పిరిట్ సినిమాకు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. డ్యూటీనే ఎమోషన్ గా బ్రతికే పోలీస్ గా ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారట. డ్యూటీ విషయంలో హద్దులు దాటిన కమిట్మెంట్ ఉన్న పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని సమాచారం తెలుస్తుంది.సందీప్ సినిమాలలోని హీరోల పాత్రలు సాధారణంగా చాలా రిచ్ గా ఉంటాయి. అయితే ఈ మూవీ విషయంలో మాత్రం సందీప్ రూట్ మార్చారు. ప్రభాస్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ సమయానికి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్ ను పూర్తి చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.


ఈ స్పిరిట్ మూవీ బడ్జెట్ విషయంలో కూడా లిమిట్స్ లేవని సమాచారం తెలుస్తోంది.ఇక యానిమల్ మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.ఇక నాన్ థియేట్రికల్ హక్కులతోనే ఈ సినిమాకు ఏకంగా 70 శాతం రికవరీ అయిందని తెలుస్తోంది. స్పిరిట్ సినిమా ఒక భాగంగా తెరకెక్కుతుందా లేక రెండు భాగాలుగా తెరకెక్కుతుందా అనే ప్రశ్నలకు అయితే ఇంకా జవాబు దొరకాల్సి ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.ఇక మరికొన్ని గంటల్లో ప్రభాస్ సలార్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుండగా ఈ ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రేంజ్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి సినిమా తరువాత వరుస ప్లాపులు వచ్చినా ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప ఇంచు కూడా తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: