ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తోన్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ప్రస్తుతం ఈ షూటింగ్‌కు మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది.అయితే ఉన్నట్లుండి తన షూటింగ్‌ కు బ్రేక్‌ ఇచ్చాడు రామ్‌ చరణ్‌. గురువారం (నవంబర్ 30) జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకుమైసూర్‌ నుంచి ఒక ప్రైవేట్‌ విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మైసూరు విమానాశ్రయంలో రామ్ చరణ్ కనిపించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం సిబ్బంది రామ్‌ చరణ్‌తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ప్రయాణ హడావిడిలో ఉన్నప్పటికీ చెర్రీ ఎంతో ఓపికగా అభిమానులతో ఫొటోలు దిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా జూబ్లీహిల్స్‌ క్లబ్‌ పోలింగ్‌ బూత్‌ 149లో మెగా ఫ్యామిలీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌ తదితరులు ఇక్కడే ఓటు వేయనున్నారు. కాగా 'గేమ్ ఛేంజర్' సమకాలీన రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కమర్షియల్‌ అంశాలకు ప్రాధాన్యత నిస్తూనే సందేశాత్మకంగా గేమ్‌ ఛేంజర్‌ను శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటును వినియోగించుకునేందుకు రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ కు బ్రేక్ ఇచ్చాడు. గురువారం (నవంబర్ 30) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత రామ్ చరణ్ మైసూర్‌కు తిరిగి రానున్నారు. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ఘనవిజయం సాధించడంతో రామ్‌ చరణ్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దాంతో ఆయన తదుపరి లపై అంచనాలు భారీగా ఉన్నాయి.

స్టార్ డైరెక్టర్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' కాబట్టి హైప్ ఎక్కువైంది. ఈ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌ రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: