తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సీజన్ వోల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో కు సంబంధించిన 12 వారాల ఆట ముగిసింది. ప్రస్తుతం 13 వ ఆకారం ఆట కొనసాగుతోంది. ఇక 13 వ వారం హౌసు నుండి బయటకు వెళ్లే సభ్యుల కోసం నామినేషన్ ల ప్రాసెస్ ఇప్పటికే ముగియగ ఈ వారం హౌస్ లో ఉన్న ఎనిమిది మందిలో ఒక అమర్ దీప్ తప్ప అందరూ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు.

ఈ వారం నామినేషన్ లలో సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ... నటుడు శివాజీ తో పాటు ప్రిన్స్ ... గౌతమ్ కృష్ణ , అర్జున్ , ప్రియాంక , శోభా శెట్టి లు ఉన్నారు. ఇక వీరిలో ప్రస్తుతం అనాఫిషియల్ పోల్స్ ప్రకారం చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ అదిరిపోయే రేంజ్ ఓటింగ్ పర్సంటేజ్ తో అందరికంటే ముందు స్థానంలో కొనసాగుతూ ఉండగా ... ఆయన తర్వాత శివాజీ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ప్రిన్స్ యవర్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈ ముగ్గురు కూడా ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారు.

వీరిలో నుండి ఎవరు కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇకపోతే వీరి తరువాత గౌతమ్ కృష్ణ , అర్జున్ , ప్రియాంక , శోభా లు కొనసాగుతున్నారు. అందరి కంటే తక్కువ ఓట్లతో ప్రియాంక , శోభ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం హౌసు నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి వీరు రాబోయే రోజుల్లో తమ ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని తమ ఓటింగ్ శాతాన్ని ఏమైనా పెంచుకొని సేఫ్ జోన్ లోకి వీరిద్దరూ వస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: