హిట్ ... ప్లాట్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఇప్పటికే అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో కొన్ని మూవీ లు పరవాలేదు అనే స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ నటుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి రత్నం కృష్ణ దర్శకత్వం వహించగా ... నేహా శెట్టిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేక అపజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ వారు తమ "ఓ టి టి" సంస్థ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈ సినిమాకి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏ స్థాయి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుందో చూడాలి. ఇకపోతే మెహెర్ చాహల్, వెన్నెల కిషోర్ , సుబ్బరాజు , హైపర్ ఆది , వైవా హర్ష , అను కపూర్ , అజయ్ , విజయ్ పట్కర్ , మకరంద్ దేష్పాండే , నెల్లూర్ సుదర్షన్ , గోపరాజు రమణ , అభిమన్యు సింగ్ తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... అమ్రీష్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. దివ్యాంగ్ లవనియా , మురళి కృష్ణ వేమూరి ఈ మూవీ ని నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: