నటిగా ... యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా భారీ క్రేజ్ ను సంపాదించుకోలేకపోయింది. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినటువంటి పటాస్ షో కి యాంకర్ గా వ్యవహరించి దీని ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటికి అనేక టీవీ షో లలో యాంకర్ అవకాశాలు దక్కడం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటికి కూడా ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలను ... యాంకరింగ్ అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలకు సమాధానం ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శ్రీ ముఖి ముచ్చటిస్తున్న సమయంలో ఓ నేటిజన్ ఈమెను నీకు ఎప్పుడు అయినా బ్రేకప్ జరిగిందా అని అడిగాడు. దానికి శ్రీ ముఖి ఏ మాత్రం మొహమాట పడకుండా చాలా సార్లు జరిగింది అని చెప్పుకొచ్చింది.

ఇక అందులో భాగంగా శ్రీ ముఖి నేను నా కెరియర్ బిగినింగ్ లో ఒక అబ్బాయిని ఇష్ట పడ్డాను. అతను కూడా నన్ను చాలా ప్రేమించాడు. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అలా మా జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్న సమయంలో నాకు ఆఫర్ లు కూడా భారీగా వచ్చాయి. అలా పర్సనల్ గా ... కెరియర్ పరంగా నా లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది అనే సమయం లోనే మా ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దానితో మేము విడిపోయాం. దానితో నేను చాలా రోజులు బాధపడ్డాను. కొన్ని సందర్భాలలో చనిపోదాం అని కూడా అనుకున్నట్లు శ్రీ ముఖి తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: