
ఇక దీంతోపాటుగా ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలు చేసిన శ్రీరామ్ డైరెక్షన్ లో కూడా నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఇక అదే విషయం మీద నితిన్ స్పందిస్తూ ఇప్పటికే వేణు శ్రీరామ్ తనకోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా నితిన్ తెలియజేశాడు. అయితే వేణు శ్రీరామ్ ఇంతకుముందే ఐకాన్ అనే ఒక టైటిల్ తో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది అనివర్య కారణాల వల్ల ఆగిపోయింది.ఇక ఇప్పుడు ఆ స్టోరీ నే నితిన్ తో చేస్తున్నాడా..? అనే టాక్ అయితే బయట నడుస్తుంది. కానీ నితిన్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఈ స్టోరీ సెపరేట్ అని దానికి దీనికి సంబంధం లేదు అని తెలుస్తుంది.ఇక ఇది ఒక ఫ్రెష్ అన్నదమ్ముల కథగా రబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి తమ్ముడు అనే టైటిల్ ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఇక తమ్ముడు అన్న టైటిల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమా ఆయన కెరియర్ లోనే ఒక మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఇక అదే టైటిల్ ని వాడుకుంటున్న నితిన్ కూడా ఈ సినిమాతో సరైన సక్సెస్ కొట్టాలనే ఆశ భావాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు… ఇక దీంతో వేణు శ్రీరామ్ చేసే సినిమా స్టోరీ ఫ్రెష్ స్టోరీ కావడంతో నెక్స్ట్ తను ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ తో కూడా ఐకాన్ అనే సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.