ఇటీవల కాలంలో సినీ ప్రేక్షకుల పంథ మారిపోయింది. దీంతో ఒకప్పటిలా రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు అస్సలు ఇష్టపడటం లేదు. ఒక సినిమాలో స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నప్పటికీ ఇక సరైన కథ కథనం ఉంటేనే ఆ సినిమాను హిట్ చేస్తున్నారు. లేదంటే వందల కోట్ల భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలను సైతం డిజాస్టర్ గానే మార్చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. దీంతో ఇప్పటికే తామేంటో నిరూపించుకునే హీరోలు డైరెక్టర్లు సైతం ఇక ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.


 స్టార్ హీరో ఉన్నాడు కదా అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి సినిమా ఎలా తీసిన హిట్ అవుతుంది అనుకుంటే చివరికి నిర్మాతలకు నష్టాలే మిగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలే భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలే ఎక్కువగా డిజాస్టర్ గా మిగులుతున్నాయ్. చిన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్లుగా నిలుస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇలా డిజాస్టర్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ ఏది అంటే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 అని చెప్పాలి. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి.


 సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ ఎందుకో టైగర్ త్రీ సినిమాకి మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు అని చెప్పాలి. ఇది మాత్రమే కాదు అంతకు ముందు సల్మాన్ ఖాన్ నటించిన కిసికా భాయి కిసి కా జాన్, యాంటీమ్ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఇలా వరుసగా తన సినిమాలకు తక్కువ కలెక్షన్లు వస్తు ఉండడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలకు వసూళ్లు తక్కువగా రావడానికి.  టికెట్ ధరలే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. టికెట్ ధరలు తక్కువగా ఉండడంతోనే సరైన వసూళ్లు సాధించలేకపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: