యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాగా అల్లరి చేస్తారని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా ఊహించని రేంజ్ లో పెరుగుతుండగా సినిమా సినిమా కు తారక్ కెరీర్ పరంగా ఎదుగుతున్న తీరు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే ఎన్టీఆర్ అల్లరి గురించి తాజా గా శ్రీకాంత్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో తాజా గా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ దేవర సినిమా లో తారక్ తో కలిసి నటిస్తున్నారు. తారక్ సినిమాల్లోకి రాకముందు తన ఇంటి పక్కనే ఉండేవాడని ఒకరోజు తారక్ నా కొడుకు రోషన్ ను ఎవరికీ చెప్పకుండా ఎత్తుకెళ్లిపోయాడని అన్నారు. రోషన్ కనిపించక పోవడం తో కుటుంబ సభ్యులు చాలా కంగారు పడ్డారని శ్రీకాంత్ కామెంట్లు చేశారు.ఆ సమయంలో తారక్ తన ఇంటికి ఏం బాబాయ్ వెతుకుతున్నావని అడుగుతూ వచ్చాడని రోషన్ తన దగ్గరే ఉన్నట్టు చావు కబురు చల్లగా చెప్పాడని తారక్ అంత ఎనర్జిటిక్ వ్యక్తిని చూడలేదని శ్రీకాంత్ అన్నారు. చిరంజీవి ఫ్యాన్ ను కాకపోతే సినిమాల్లోకి వచ్చేవాడిని కాదని శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఫ్లాపుల్లో ఉన్న సమయం లో చిరంజీవి ధైర్యం చెప్పారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.బాలయ్య భోళా శంకరుడని బాలయ్య ఏదైనా స్ట్రెయిట్ గా చేసేస్తాడని శ్రీకాంత్ కామెంట్లు చేశారు. చరణ్ మెచ్యూర్డ్ పర్సన్ అని సాఫ్ట్ గోయింగ్ అని శ్రీకాంత్ అన్నారు. వెంకటేశ్ హ్యాపీ పర్సన్ అని ఆయన నవ్వుతూ మాట్లాడతారని శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ ప్రస్తుతం కెరీర్ పరంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గా ఉన్నారు. శ్రీకాంత్ భవిష్యత్ ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉండాలని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: