కాంతారా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.దీంతో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తున్న రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం
కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టికి ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్న వార్తలు వస్తున్నాయి. గతేడాది రిలీజైన కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లు వసూలు చేసినా.. రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్ల రూపాయలు మాత్రమే..అయితే ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ పై అంచనాలు భారీగా పెరగడంతో అతని రెమ్యునరేషన్ కూడా 25 రెట్లు పెరిగి రూ.100 కోట్లకు చేరినట్లు సమాచారం.ఈ రెమ్యునరేషన్ లో సగం అంటే రూ.50 కోట్లు అడ్వాన్స్ గా అతనికి అందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా హక్కులు అమ్మిన తర్వాత వచ్చే లాభాల్లో రిషబ్ శెట్టికి వాటా దక్కనుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి రైటర్ గా,డైరెక్టర్ గా అలాగే యాక్టర్ గా కూడా అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు . ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ కూడా రిలీజైంది. ఈ వీడియో వచ్చిన తర్వాత ఈ కాంతార ప్రీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో రిషబ్ ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రిషబ్  పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించాడు గతేడాది రిలీజైన కాంతారా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.407.82 కోట్లు వసూలు చేసింది. అందులో కేవలం ఇండియాలోనే దాదాపు రూ.363.82 కోట్లు వచ్చాయి. ఇప్పుడు కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ దాదాపు ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ మరియు ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: