బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇక పోతే తాజాగా ఈయన "టైగర్ 3" అనే స్టైలిష్ యాక్షన్ ట్రైలర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిం ది .

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ యావరేజ్ విజయం అందుకున్నప్పటికీ ఈ సినిమా లోని యాక్షన్స్ సన్ని వేశాలకు మాత్రం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ "ది బుల్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సల్మాన్ కి జోడి గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియార అద్వానీ నటించబోతున్నట్లు ఇప్పటికే ఈ విషయమై ఈ మూవీ యూనిట్ ఈ నటిని సంప్రదించగా ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం కియారా ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: