తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి విశాల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో చాలా మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఆఖరుగా విశాల్ ... అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం విశాల్ ... హరి దర్శకత్వంలో రత్నం అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను విడుదల చేస్తూ ... ఈ సినిమా టైటిల్ ను ప్రకటించింది. ఇకపోతే ఈ వీడియో సూపర్ గా ఉండడం అలాగే ఇందులో విశాల్ లుక్ కూడా కూడా సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో విశాల్ ... హరి కాంబోలో రూపొందిన పూజ మూవీ మంచి విజయం సాధించడంతో రత్నం మూవీ పై కూడా తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత.కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: