అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో ఏళ్లపాటు అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించడమే కాకుండా ఎంతో మంది హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీదేవి తన మొదటి తమిళ చిత్రం పూర్తి స్థాయిలో ప్రధాన పాత్రలో నటించడం జరిగిందట.అయితే శ్రీదేవి ఈ సినిమాకి అందుకున్న రెమ్యూనరేషన్తో పోలిస్తే తన కూతురు జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దేవర సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ని పోలిస్తే కొన్ని రెట్ల అధికంగా ఉంటుంది.. అయితే అప్పటి కాలంతో ఇప్పటి పోల్చడం సరికాదు కానీ.. తల్లి కూతుర్ల మధ్య రెమ్యూనరేషన్ లో భారీవ్యత్యాసం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.శ్రీదేవి దేశంలోని ఎంతోమంది సూపర్ స్టార్ లతో కలిసి కొన్ని దశాబ్దాల పాటు నటించింది..శ్రీదేవి దివంగత నటి కూడా అత్యంత పారితోషకం అందుకున్న కథానాయకగా పేరుపొందింది శ్రీదేవి. తన మొదటి సినిమా తమిళ చిత్రానికి చెల్లించిన రెమ్యూనరేషన్ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీదేవి నటించిన థ్రిల్లర్ చిత్రం ముండ్రు ముడిచులో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి కేవలం 5000 రూపాయలు మాత్రమే ఇచ్చారట.. ఈ సినిమాని డైరెక్టర్ కే బాలచందర్ దర్శకత్వం వహించారు. 13 ఏళ్ల వయసులోనే ఈమె ఈ సినిమాతో నటించింది.


జూనియర్ ఎన్టీఆర్ సరసన ఈమె కూతురు జాన్వి కపూర్ దేవర సినిమాలో నటించింది. ఈ సినిమాకి దాదాపుగా ఈమె 3.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. శ్రీదేవి అందుకున్న రెమ్యూనరేషన్తో పోలిస్తే ఇది ఎన్నింతలో ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం ధడక్ కోసం ఈ ముద్దుగుమ్మ తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల 60 లక్షల రూపాయల అట.. శ్రీదేవి 1975లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫిమేల్ హీరోయిన్లుగా మంచి పాపులారిటీ సంపాదించి హీరోలతో సమానంగా వేతనాలను తీసుకునేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: