కృతిశెట్టి: వరుస ప్లాపులు.. అయినా తగ్గట్లే?


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన సూపర్‌ 30 అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన కృతిశెట్టి ఆ తర్వాత టాలీవుడ్‌ లో 'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ అవ్వడంతో కృతికి అవకాశాలు బాగా పెరిగాయి.ఆ తరువాత వరుసగా సినిమాలు చేసినా కానీ ఒక్కటి కూడా ఆమెకు ప్లస్‌ అవ్వలేదు. దాంతో ఆమెకు అవకాశాలు కూడా పూర్తిగా తగ్గాయి.వరుస ప్లాపులతో ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యని కృతి తమిళ సినిమాలు మాత్రం రెండు సినిమాలు చేస్తోంది.ఇక ఈ రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రేక్షకులతో, అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు హల్‌చల్‌ చేస్తుంటుంది. అలాగే ఫోటో షూట్స్‌తో తన అందాల్ని ప్రదర్శిస్తూ యూత్‌కి పిచ్చెక్కించేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. తాజాగా చేసిన ఫోటో షూట్‌లో మత్స్యకన్యగా నెట్టింటిని షేక్ చేస్తుంది.


తను వేసుకున్న కాస్ట్యూమ్‌కి స్టార్‌ ఫిష్‌లా కలర్స్‌ అద్దడంతో అచ్చం మత్స్యకన్యలాగే కనిపిస్తోంది కృతి శెట్టి. ఇంకా అలాగే తన అందమైన కర్లీ హెయిర్‌ని చూపిస్తూ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. సప్త సముద్రాలని దాటి వచ్చిన మత్స్యకన్య అంటూ ఆమె అభిమానులు ఆ ఫోటోపై కామెంట్‌ చేస్తున్నారు. ఇక తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమాకు నేషనల్‌ అవార్డు రావడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.ఇక ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ని ఊపేసి యూత్ గుండెల్లో గుడి కట్టుకొని కుర్రాల్ల కలల రాణిగా ఓ రేంజ్ ఫాలోయింగ్ అందుకున్న  కృతి శెట్టి మళ్ళీ తెలుగులో ఆఫర్లు దక్కించుకొని బిజీ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి. ఆమె కం బ్యాక్ ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి మళ్ళీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఎప్పుడు బిజీ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: