కెరీర్ స్టార్టింగ్ లో పందెంకోడి, పొగరు లాంటి యాక్షన్ మూవీస్ తో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు విశాల్. అలాంటి ఈ హీరోకి గత కొంతకాలంగా సరైన సక్సెస్ దక్కడం లేదు. రీసెంట్ గా వచ్చిన 'మార్క్ ఆంటోనీ' కోలీవుడ్ లో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. కానీ మన దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. అయితే విశాల్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటుంది మాత్రం ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ అలాంటి ఓ యాక్షన్ మూవీని కోలీవుడ్ లో యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన హరి దర్శకత్వంలో చేస్తున్నాడు విశాల్. ఇప్పటికే సింగం సిరీస్ తో ప్రేక్షకులను 

ఆకట్టుకున్న హరి ఇది వరకు విశాల్ తో 'పూజా' అనే సినిమా చేశాడు. ఈ మూవీ మంచి సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో యాక్షన్ డ్రామా రాబోతోంది. కొద్దిసేపటికి క్రితమే ఈ సినిమా తాలూకు కాన్సెప్ట్ టీజర్ ని విడుదల చేస్తూ టైటిల్ సైతం రివీల్ చేశారు. వీరి కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమాకి 'రత్నం' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఈసారి విశాల్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఒక మైదానంలో గుర్రాలు దున్నపోతులు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య లారీ నుంచి దిగి మోకాళ్ళ మీద కూర్చున్న

 ఓ దుండగుడి తల నరికి దాన్ని చేత్తో పట్టుకుని విశాల్ నడిచి వచ్చే సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. టీజర్ లో స్టోరీ ని రివీల్ చేయలేదు. కానీ చాలా కాలం తర్వాత ఈ మూవీలో విశాల్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే కనిపిస్తోంది. సాధారణంగానే డైరెక్టర్ హరి సినిమాలంటే ఓ రేంజ్ లో హీరోయిజం, సవాళ్లు విసురుతూ హీరో, విలన్ మధ్య డ్రామాని ఓ రేంజ్ లో చూపిస్తూ ఉంటాడు. తాజాగా రిలీజ్ అయిన రత్నం టీజర్ కూడా అదే తరహాలో ఉండబోతోంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమన్యుడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ విశాల్ కి పడలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: