సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   సినిమా రిలీజ్ కి కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 రోజుల్లోనే మూవీ టీం ప్రమోషన్స్ ని ప్లాన్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు సినిమా నుంచి టీజర్ తో పాటూ 'దమ్ మసాలా' అనే సాంగ్ రిలీజ్ అయింది. 

వీటికి ఫ్యాన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ రాగా నార్మల్ ఆడియన్స్ లో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. రిలీజ్ కు ముందు వరకు సినిమా నుంచి కనీసం ఒక్క పాటైనా ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తే సినిమాపై హైప్ దానంతట అదే వస్తుంది. ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేయాలంటే సరైన అప్డేట్ ఒక్కడుంటే చాలు. ఈమధ్య చాలా సినిమాలు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల నిర్మాత నాగ వంశీ డిసెంబర్లో గుంటూరు కారం నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ అవుతాయని వెల్లడించాడు. అంటే డిసెంబర్లో గుంటూరు కారం మ్యూజికల్ ప్రమోషన్స్ ని మూవీ టీం షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 త్రివిక్రమ్ గత చిత్రం 'అలవైకుంఠపురంలో' మ్యూజికల్ ప్రమోషన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. కేవలం పాటలతోనే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. ప్రతి ఒక్క సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇందుకు కారణం త్రివిక్రమ్ అండ్ టీం ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్ కోసం చాలా టైం తీసుకున్నారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని గురూజీ గుంటూరు కారం కోసం వాడతారా? లేదా అనేది చూడాలి. కానీ గుంటూరు కారం రిలీజ్ కు కేవలం 40 రోజులే ఉండడంతో ఈ టైంలోనే సినిమాను ప్రమోట్ చేసి ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: