లవర్ బాయ్ నితిన్ ప్రస్తుతం తన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ' సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే నితిన్ వరుస ఇంటర్వ్యూ లతో బిజీ అవుతున్నాడు. ఇలాంటి తరుణంలో నితిన్ కి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నుంచి రావడం విశేషం. ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

తాజాగా నితిన్ ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో ధోని ఆటోగ్రాఫ్ తో ఉన్న టీ షర్ట్ ని పట్టుకొని స్మైల్ ఇస్తూ కనిపించాడు. అందులో బెస్ట్ విషెస్ నితిన్ అంటూ ధోని ఆటోగ్రాఫ్ ఉంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ పట్ల నితిన్ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.." థాంక్యూ ధోని సర్.. లవ్ యూ" అంటూ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చేశాడు. ఇంతకీ నితిన్, ధోని ఎక్కడ కలుసుకున్నారు? అనే విషయం తెలీదు కానీ ధోని ఆటోగ్రాఫ్ తో ఉన్న టీ షర్ట్ ని చూపిస్తూ నితిన్ షేర్ చేసిన ఫోటో మాత్రం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

ఇక నితిన్ విషయానికి వస్తే, గత కొంతకాలంగా ఈ హీరోకి సరైన విజయం దక్కడం లేదు. 'భీష్మ' తర్వాత నితిన్ కి మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అయితే రాలేదు. భీష్మ తర్వాత నితిన్ నటించిన రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' తో హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఈసారి నితిన్ కి హిట్ పడేలా కనిపిస్తోంది. కమర్షియల్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: