2023 వ సంవత్సరం విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 ఇండియన్ మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ 2023 వ సంవత్సరం విడుదల అయ్యి 146.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన ఇండియన్ సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ సినిమా 137 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీ ఈ సంవత్సరం విడుదల అయ్యి 126 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

 రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా 115.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ ఈ సంవత్సరం విడుదల 105 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలవగా ... సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన టైగర్  3 సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యి 94 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఆరవ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యి 91.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలవగా ... పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ 59.12 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలిచింది. గదర్ 2 సినిమా 53.50 కోట్ల కలెక్షన్ లతో 9 వ స్థానంలో నిలవగా ... విర సింహా రెడ్డి మూవీ 50.10 కోట్ల కలెక్షన్ లతో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: