అల్లరి నరేష్ లో ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జనాలకు నచ్చుతుంది. హిట్ ఫ్లాప్ అన్న విషయం పక్కనపెడితే కచ్చితంగా ఆయన సినిమాను చూసి నవ్వుకుంటారు.అయితే ఈ మధ్యకాలంలో ఆయన హిట్ కొట్టిందే లేదు … కొన్ని కొన్ని కాన్సెప్ట్ లు ఆయన బాడీకి సూట్ అవ్వనివి సెలక్ట్ చేసుకొని రిస్క్ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో సెట్ అయినట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతుంటాయి .అలాంటి ఓ క్రేజీ రేర్ కాంబో ని ఎన్టీఆర్ - అల్లరి నరేష్ . వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావడానికి ఆ డైరెక్టర్ తెగ ట్రై చేశారట. భారీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారట . కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఎందుకు వీళ్ళ కాంబోలో సినిమా రాలేకపోయింది.. అనే విషయాలు తెలుసుకుందాం. అయితే మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ సెకండ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి .ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . అయితే ఈ సినిమాల్లో ముందుగా వంశీ పైడిపల్లి మహేష్ బాబు రోల్ లో ఎన్టీఆర్ ని అనుకున్నారట. కథ కూడా వివరించారట. మంచి మెసేజ్ కాన్సెప్ట్ సినిమా కావడంతో తారక్ చేస్తే జనాలకు బాగా నచ్చుతుంది అంటూ చాలాసార్లు ట్రై చేశారట. అయితే అప్పటికే వేరే సినిమాల్లో బిజీగా ఉన్న తారక్సినిమా కోసం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు .తారక్ తో ఈ సినిమా తీయాలి అంటే మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి .అంత టైం లేక వంశీ పైడిపల్లి ఆస్థానంలోకి మహేష్ బాబును తీసుకొచ్చారు . అలా తారక్- అల్లరి నరేష్ సినిమా మిస్సయింది .వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: