డైనమిక్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది.రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, సురేష్ ఒబెరాయ్, తృప్తి దిమ్రి, శక్తికపూర్ నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి స్పందన రావడంతో రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన యానిమల్ చిత్రం సుమారుగా 200 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకుపైగానే అయింది. ఈ సినిమా 4000 స్క్రీన్లలో ప్రదర్శించబడుతూ సుమారుగా 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.యానిమల్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పఠాన్ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో యానిమల్ చేరింది.

యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు కలెక్షన్లు ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా 9 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇక హిందీ వెర్షన్ వసూళ్ల వివరాల్లోకి వెళితే.. 55 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ సినిమా 64 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఇక యానిమల్ సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడలో కలిపి 8 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఇక హిందీలో 60 కోట్ల షేర్, అన్ని భాషల్లో కలిపి ఇండియాలో 68 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండో రోజు కూడా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది.యానిమల్ సినిమా 2 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 17 కోట్ల రూపాయలు రాబట్టింది. హిందీ వెర్షన్ సుమారుగా 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ఈ సినిమా 132 కోట్ల షేర్, 250 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: