టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించడం లేదు. ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు. అప్పటినుండి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. కానీ విజయ రష్మిక మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వీరిద్దరి ప్రవర్తన చూస్తుంటే మాత్రం నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక విజయ్ ఇద్దరు

కలిసి వెళ్లడం తన ఫ్యామిలీతో కలిసి రష్మిక కనిపించడం దాంతోపాటు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు రష్మిక మందన రావడం ఇలా అన్ని చూస్తుంటే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని ఫిక్స్ అయిపోయారు. దాంతోపాటు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ద్వారా వీరిద్దరూ తరచూ కలసి ఉంటున్నారు అని భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మా ఇల్లు అంటూ విజయ్ దేవరకొండ ఇంటిని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చింది రష్మిక. విజయ్ తల్లి తనకు సెకండ్ మదర్

 అంటూ కూడా చెప్పింది. దాంతో రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి కోడలుగా వెళ్లడం ఫిక్స్ అని అంటున్నారు. తాజాగా మరొకసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రౌడీ వేర్ అనే ఒక క్లాత్ బ్రాండ్ ద్వారా బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు కూడా హుడి వేసుకున్నారు రష్మిక. రౌడీ వేర్ బ్రాండ్ కి సంబంధించినటువంటి హుడి వేసుకుని ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఒక్కసారిగా ఈమెను చూసినటువంటి వారందరూ విజయ్ దేవరకొండ అంటూ గట్టిగా అరిచారు.తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో రష్మిక లాంటి డ్రెస్సును విజయ్ దేవరకొండ వేసుకొని కనిపించారు. దీంతో మరోసారి ఇప్పుడు వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: