రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల అయింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని కోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో పలువురి హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.మొదటి రష్మిక మందన ఆ తర్వాత కాజోల్ అలియా భట్ ఇలా చాలామంది హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై రష్మిక మందన్న కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, నాగ చైతన్య సహా పలువురు నటీనటులు ఇలాంటి ఘటనను ఖండించారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. యానిమల్‌ సినిమాతో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో టాపిక్‌ మళ్లీ తెరపైకి వచ్చింది.దానికి కారణం యానిమల్ సినిమాలోని రష్మిక మందన్న హాట్ సీన్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో రష్మిక మందన్న రణబీర్ కపూర్ భార్య గీతాంజలి పాత్రలో నటిస్తుంది..  వీరిద్దరి మధ్య సన్నిహిత సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, క్లిప్‌లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాకు అడల్ట్స్ ఓన్లీ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం సరైనదేనని పలువురు మండిపడుతున్నారు. యానిమల్‌ సినిమా లోని రష్మిక హాట్‌ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో రష్మిక మందన్నను ట్రోల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డీప్‌ఫేక్ వీడియోతో బాధపడి ఏడ్చింది రష్మికనేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోకు మించి ఎక్కువ మోతాదులోనే హాట్‌గా కనిపించిందని వారు తెలుపుతున్నారు.రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఎందుకు చూడటం, యానిమల్‌ సినిమాకు వెళ్లి చూడండి అంటూ వ్యంగ్యంగా తెలుపుతున్నారు. స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడంలో లేని బాధ డీప్‌ ఫేక్‌ వీడియోల వల్ల ఇబ్బంది వచ్చిందా అంటూ ఆమెపై విమర్శలకు దిగుతున్నారు. డీప్ ఫేక్ వీడియోని మించి ఆమె అందాలను ఆరబోసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: