పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ కు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. సలార్ సినిమా ట్రైలర్ కు 24 గంటల్లో ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ రాగా 2.7 మిలియన్ల లైక్స్ వచ్చాయి.అంచనాలకు తగ్గట్లే ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ ఎన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కానీ విపరీతంగా నెగటివిటీకి గురయ్యింది.సలార్ ట్రైలర్ కేజీఎఫ్ లా ఉందని నెటిజన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ప్రభాస్ వాయిస్ లో బేస్ తగ్గిపోయిందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఒకవేళ సినిమా కనుక ప్లాప్ అయితే ప్రభాస్ పని అయిపోయి కెరీర్ ఖతం అయినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఉందని సలార్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ట్రోల్స్ వస్తున్నా కూడా యూట్యూబ్ లో సలార్ సునామి కొనసాగుతుంది. అందుకే సినిమా రిలీజ్ వీక్ లో రెండో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.


ఎందుకంటే ప్రభాస్ ను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్ ను క్రియేట్ చేశారని సమాచారం అందుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సలార్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వేగం పెంచారు..అలాగే ఈ సినిమా ట్రైలర్ కు వ్యూస్ పెరగడానికి కూడా మేకర్స్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో శృతి హాసన్ పాత్రకు ప్రధాన్యత తక్కువగానే ఉందని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీచర్ రోల్ లో శృతి హాసన్ కనిపించే ఛాన్స్  ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను మించి తెరకెక్కించలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సలార్ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో దర్శకునిగా ఖచ్చితంగా మరో మెట్టు పైకి ఎక్కడం ఖాయం అంటున్నారు. సలార్ సినిమా రాకతో థియేటర్లు షేక్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తొలిరోజే సలార్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: