ఈ సంవత్సరం వచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. 'పఠాన్' లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ కి మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది 'జవాన్'.ఈ సినిమాలో నయనతారతో పాటు దీపికా పదుకోనె కూడా ముఖ్య పాత్ర పోషించింది.షారుఖ్ ఖాన్ దీపికా కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో సహజంగానే మంచి అంచనాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్లది హిట్ పెయిర్ కాబట్టి.. ఈ కాంబోలో ఉండే సూపర్ సీన్స్ ను ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు.దానిని డైరెక్టర్ అట్లీ క్యాష్ చేసుకొని వీరి మధ్య డిఫరెంట్ లవ్ ట్రాక్ ను పెట్టాడు. మెయిన్ గా కుస్తీ సీన్ పెట్టి వీరి మధ్య రొమాన్స్  బాగా పండేలా చేశాడు. ఆ సీన్ క్లాస్, మాస్ ఆడియన్స్ కి ఎంతగానో కనెక్ట్ అయ్యింది.


అందుకే 'డంకి' సినిమాలో ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.ఈ సినిమాపై షారుఖ్ ఖాన్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఎందుకంటే ఈ సినిమాని తెరకెక్కించేది ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయినా రాజ్ కుమార్ హిరాని కాబట్టి. ఆయన ఇంతవరకు ఒక్క ప్లాప్ కూడా ఇవ్వలేదు. ఆయన తీసినవన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే. పైగా రికార్డులు క్రియేట్ చేశాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో వందల కోట్లు వసూలు చేసి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్లు కొట్టాయి. కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా అవార్డులు కూడా ఆయన సినిమాల సొంతం అయ్యాయి. అలాంటి సూపర్ డైరెక్టర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: