పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ:లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ వీడియోకు సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఈ వీడియో ద్వారా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత పవన్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతుండడం ... అలాగే ఇందులో పవన్ లుక్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై తారా స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో పవన్ పాత్ర సినిమా ప్రారంభమైన చాలా సమయానికి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ... దాదాపుగా పవన్ ఎంట్రీ ఈ మూవీ లో ఇంటర్వెల్ కు కొంత సమయం ముందే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఒక భారీ సన్నివేశంతో పవన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పవన్ ఈ మూవీ తో పాటు ప్రస్తుతం హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లలవ్ కూడా హీరోగా నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: