తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ... నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ ఆఖరుగా అమిగొస్ అనే సినిమాలో హీరోగా నటించిన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ లో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపాందుతున్న నా సామి రంగా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎంఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ బిగ్ బాస్ షో నుండి ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆశకా రంగనాథ్ కి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఇక ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ వరలక్ష్మీ పాత్రలో కనిపించబోతుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఆశిక అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: