
ఇక ఈ మూవీ తో పాటు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీగా కొనసాగుతున్న వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మరో హీరోగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ మూవీ వార్ 2 తర్వాతే ఉండబోతుంది అని చెప్పాలి. కాగా వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మార్చ్ నెల నుంచి ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం డేట్స్ కేటాయించాడట తారక్.
మార్చ్ మొదటి వారానికి దేవరా షూటింగ్ పూర్తవుతుంది. దీంతో వెంటనే ఓ వారం విశ్రాంతి తీసుకొని వార్ 2 ప్రాజెక్టులో చేరబోతున్నాడట. అయితే ఈ మూవీలో ముందుగా తారక్ - హృతిక్ పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారట. ఇక ఈ సీన్ కి అటు థియేటర్లో ప్రేక్షకుల నుంచి విజిల్స్ మోత మోగుతుందని.. గూస్ బంప్స్ వస్తాయని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది కలిసికట్టుగా ఉండే కృష్ణార్జునల మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుందో.. హృతిక్ - ఎన్టీఆర్ మధ్య కూడా అలాంటి సన్నివేశాలు ఉంటాయట.