
వామ్మో అశ్విని ఏంటి ఇలా ఉండేదా ఈమె ఇన్ని సినిమాలలో నటించారా అంటూ కూడా అందరూ షాక్ అయ్యారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో 12వ వారం తర్వాత ఎలిమినేట్ అయినటువంటి అశ్విని ప్రస్తుతం పలు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన ఇంస్టాగ్రామ్ వీడియోస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంస్టాగ్రామ్ లో ఈమె భారీ స్థాయిలో బోల్డ్ ఫోటోషూట్ లో వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈ వీడియోలపై నేటిజన్స్ నుంచి కూడా విభిన్న రకాలుగా కామెంట్లు వస్తుంటాయి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అశ్విని యాంకర్ ప్రశ్నిస్తూ అసలు ఇంస్టాగ్రామ్ లో మీ ఫోటోలు వీడియోల కింద వచ్చే కామెంట్స్ మీరు చూస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నేను షేర్ చేసే కొన్ని ఫోటోలకు సూపర్ క్యూట్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తారు. ఇక్కడ వరకు పరవాలేదు కానీ చాలామంది మరింత నెగిటివ్ గా కామెంట్స్ చేస్తారని అలాంటి కామెంట్స్ చదవటానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి అంటూ అశ్విని కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ మనం చదవలేమంటూ అలాంటి దారుణమైన భయంకరమైన కామెంట్లు వస్తాయని ఈ సందర్భంగా అశ్విని తెలిపారు. మీరు ఒక ఫోటో షేర్ చేస్తే చాలా కామెంట్స్ వస్తాయి కదా అన్ని చదువుతారా అంటూ మరొక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అశ్విని సమాధానం చెబుతూ నా ఇంస్టాగ్రాఫ్ ఫోటోలు వీడియోలకు చాలా ఎక్కువగా నెగటివ్ కామెంట్లు వస్తాయి అందుకే నేను ఆ కామెంట్లను చదవను అంటూ ఈమె తెలియజేశారు. నా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ సారీ ఏమనుకోకండి అంటూ తాను కామెంట్లను చదవనని ఈ సందర్భంగా అశ్విని చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ వెళ్లకముందే పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నటువంటి ఈమె ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కూడా ఒక అవకాశం వచ్చింది అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.