
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఈ రోజుతో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు అల్లు అర్జున్ మరియు కొంత మంది ఇతరులపై హైదరాబాదులో ఈ మూవీ షూటింగును తెరకెక్కిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కీయార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం మైసూర్ లో రామ్ చరణ్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.