సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  ఇకపోతే ప్రస్తుతం మహేష్ "గుంటూరు కారం" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ ... జయరామ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. 

ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇలా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా విడుదల చేయడం కోసం ఈ మూవీ బృందం కూడా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ లోని రెండు పాటలను కూడా ఈ చిత్ర బృందం చిత్రీకరించినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని మూడవ సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని మూడవ సాంగ్ ను మహేష్ ... శ్రీ లీల పై కేరళ లొకేషన్ లలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే కేరళ కు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మూడవ వారానికి ఈ మూవీ మొత్తం షూటింగ్ ను కంప్లీట్ చేసే విధంగా ఈ చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: