టాలీవుడ్ యువ నటుడు నితిన్ తాజాగా "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బిజీయేస్ట్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... వక్కంతం వంశీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సీనియర్ నటుడు రాజశేఖర్ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... రావు రమేష్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇకపోతే హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 7 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 3 కోట్లు ... ఆంధ్ర ఏరియాలో 9 కోట్లు ... రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్లు ... ఓవర్ సీస్ లో  2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కనుక ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: