టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరోం హర. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కట్టి పడేసాయి.. ఓ క్లాస్ గా ఉండే వ్యక్తి మాస్ గా మారిపోయి గన్ను, కత్తి పట్టుకొని ఊచకోత కోయడం ఈ టీజర్ లో చూడొచ్చు. అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు.. కానీ ఇది మాత్రం యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అనే సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.."భయపడితే సింగాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు..అది భయపెడితేనే అడవి రాజని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు" అనే మరో పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ సినిమా గురించి సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.హరోం హర మూవీ మంచి హిట్ సాధిస్తుందని అలాగే ఈ మూవీ లో తాను చేసిన యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.తాను జాకీ చాన్ అభిమానినని, చిన్నప్పటి నుంచీ అతని సినిమాలు ఎన్నో చూసినట్లు సుధీర్ బాబు తెలిపారు.హరోం హర మూవీలో తాను చేసిన యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఏ హీరో కూడా చేయలేదని సుధీర్ బాబు తెలిపారు.జాకీ చాన్ యాక్షన్ సీన్స్ ని చూసి స్ఫూర్తిగా తీసుకోని ఈ సీన్స్ చేశాను.ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఓ జాకీ చాన్ అభిమానిగా డైరెక్టర్ అంచనాలను అందుకోవడానికి చాలా ప్రయత్నించానని సుధీర్ బాబు తెలిపారు.హరోం హర మూవీ భావోద్వేగాలను పండించడంతోపాటు కమర్షియల్ గానూ ఎంతో రిచ్ గా ఉంటుందని సుధీర్ స్పష్టం చేశాడు. కచ్చితంగా తన కెరీర్ ను మార్చబోయే సినిమాగా నిలుస్తుంది అని బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అవుతుందని సుధీర్ బాబు తెలిపారు. ఇక ఈ మూవీ డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ షూటింగ్ సందర్భంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు."సుధీర్ బాబు ఓ జెంటిల్మనే కాదు డార్లింగ్ కూడా..20 రోజుల పాటు నిజమైన వర్షంలో షూటింగ్ చేశాం. అలాంటి వర్షంలోనూ సుధీర్ పూర్తి నిబద్ధతతో నటించాడు. అతని అంకితభావం మాకు కూడా సవాలు విసిరింది. సుధీర్ బాబుతో పోలిస్తే మేము అంతగా కష్టపడలేమనిపించింది" అని తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: