బోల్డ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారుతుంది జాన్వీ కపూర్. ఈ స్టార్ కిడ్ ఇంస్టాగ్రామ్ వేదికగా చేసే సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా ఆమె బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.ఎద అందాలు ఎరవేస్తూ గుండెల్లో గునపాలు దించింది. జాన్వీ స్కిన్ షో అరాచకం అన్నట్లుగా ఉంది. ఆమె అందాలకు దాసోహం అంటున్న కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ ప్రమోషనల్ షూట్ కోసం జాన్వీ ఈ రేంజ్ లో రెచ్చిపోయింది. నటిగా కంటే కూడా ఆమె మోడల్ గా జాన్వీ అభిమానులను సంపాదించుకుంటుంది.శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ 2018లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దఢక్ ఆమె మొదటి చిత్రం. ఈ చిత్రం విడుదలకు ముందే శ్రీదేవి కన్నుమూశారు. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. జాన్వీ కపూర్ భిన్నమైన చిత్రాలు ఎంచుకుంది. కెరీర్ బిగినింగ్ లోనే బయోపిక్స్ చేసింది. అయితే ఆమెకు స్టార్డం తెచ్చే మూవీ ఇంకా పడలేదు.

బాలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా కూడా ఆమెకు గుర్తింపు రాలేదు. అనూహ్యంగా దేవర మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఫస్ట్ ఎన్టీఆర్ కి జంటగా అలియా భట్ అనుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె సైన్ చేసి కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో జాన్వీ కపూర్ కి ఆఫర్ వచ్చింది. జాన్వీ కపూర్ ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి, ఎన్టీఆర్ తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ లది బ్లాక్ బస్టర్ కాంబో.ఈ క్రమంలో వారి వారసులైన జాన్వీ, ఎన్టీఆర్ కలిసి నటించడం ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అదే సమయంలో సౌత్ ఇండియాకు చెందిన శ్రీదేవి దశాబ్దాల పాటు తెలుగు, తమిళ భాషల్లో అద్భుత చిత్రాలు చేసింది. ఆమె కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ చిత్రాల్లో నటింపజేయాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది. అది ఎట్టకేలకు సాకారం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర 2024 మార్చి 5న విడుదల కానుంది. జాన్వీ కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: