
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య తను నటించిన బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్ద ఫ్లాప్ కావడం పైన స్పందించారు. దూత వెబ్ సిరీస్ లో తనకు ముందు జరగబోయేవి అన్ని తెలిసిపోతూ ఉంటాయని..
అలానే తనకు తాను హిందీలో చేసిన లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా ముందే తెలిసినప్పటికీ ఆ సినిమాలో నటించానని తెలిపారు. అయితే ఎందుకు నటించారో కారణం చెబుతూ.. 'ఆ సినిమాలో నాకు అమీర్ ఖాన్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది కాబట్టి ఆ సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా నటించాను. అందుకే ఆ సినిమా ఫలితం నన్ను బాధించలేదు. ఆయనతో నటించి నేను చాలా విషయాలను సైతం నేర్చుకున్నానని. అలాంటి సినిమాలో నటించినందుకు ఇప్పటికీ గర్వపడుతున్నాను' అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య.