తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన ప్రస్తుతం సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ ... వెంకటేష్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... హిట్ ది ఫస్ట్ కేస్ ... హిట్ ది సెకండ్ కేస్ మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టైలిష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా జనవరి నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థకు భారీ ధరకు అమ్మి వేసినట్లు ... అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాల తర్వాత ఈ టీవీ ఛానల్ లో ఈ మూవీ ని ప్రసారం చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చాలా యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఇప్పటికే చాలా యాక్షన్ సన్నివేశాల షూటింగ్ పూర్తి కూడా పూర్తి కాగా అవి అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: