నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకు పోతున్నాడు అనే విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ అదరగొట్టేస్తున్నాడు. ఏకంగా యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఒకే ఏడాది ఒకటికి మంచి సినిమాలను విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 60 ఏళ్ల వయసు లో కూడా తనలో గ్రేస్ తగ్గలేదు అనే విషయాన్ని ప్రతి సినిమా తో కూడా నిరూపిస్తున్నారు బాలయ్య. అయితే అందరి హీరోలు కేవలం సినిమాల తో మాత్రమే సరిపెట్టుకుంటుంటే అటు బాలయ్య మాత్రం ఏకంగా ఓటీటిలో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం తో వ్యాఖ్యతగా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఇక మరోవైపు రాజకీయాలలోనూ బాలయ్య యాక్టివ్ గానే ఉన్నారు. అయితే మొన్నటికి మొన్న భగవంతు కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు బాలయ్య. ఇక ఆ సినిమాతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది.  ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ తో దూసుకు పోతున్న బాలయ్య బాబి దర్శకత్వంలో తెరకేకుతున్న సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని అభిమానులు కూడా నమ్ముతున్నారు. యాక్షన్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతూ ఉండడం గమనార్హం.


 కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఊటీలో జరుగుతుంది. అయితే ఈ మూవీలో ఏకంగా ద్విపాత్రాభినయం కాదు త్రిపాత్రభినయం చేయబోతున్నాడట నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలోనే ఇక మూడు పాత్రలకు గాను బాలయ్య సరసన నటించేందుకు ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. మీనాక్షి చౌదరితో పాటు మరో అగ్ర కథానాయక కూడా అటు బాలయ్య సరసన నటించబోతుందట. ఇక మూడో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: