టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు హీరో రాణా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఆయనకి పెళ్లి ఫిక్స్ అయింది అభిరామ్ అహింస అనే సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. సెన్సేషన్ డైరెక్టర్ తేజ ఈ సినిమాను నిర్మించారు. జూన్ రెండు న విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. దీంతో రెండవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు వహించాడు. వరుసగా కథలు కూడా ప్రస్తుతం వింటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యువ హీరో సినిమాల విషయం

 పక్కన పెడితే నిన్న రాత్రి అంటే డిసెంబర్ 6న శ్రీలంకలోని ఒక ఫంక్షన్ హాల్లో డెసిషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు అభిరామ్. అతి తక్కువ మంది బంధుమిత్రుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అభిరామ్ భార్య పేరు ప్రత్యూష. ఆమె సురేష్ బాబు కుటుంబానికి కొద్దిగా దూరపు బంధువు అన్న సమాచారం కూడా వినపడుతోంది. ఇక అభిరామ్ మరియు ప్రత్యూష ఇద్దరూ వరసకి బావ మరదలు అవుతారు అని సమాచారం. పెళ్లి తర్వాత వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండగా ఫోటోల్లో వీరిద్దరు చూడు చాలా

చూడముచ్చటగా  ఉన్నారు. ఇక 3 రోజుల పాటు  అభిరామ్ – ప్రత్యూష..ల పెళ్లి సంబరాలు జరిగినట్లు. హల్దీ వేడుకలు, సంగీత్ వంటి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో కూడా ఓ రిసెప్షన్ ను ఏర్పాటు చేయాలని సురేష్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు సైతం ఇలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని తిరిగే హైదరాబాదు వచ్చాక టాలీవుడ్ సినీ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాగే సురేష్ బాబు కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం అభిరామ్ ప్రత్యుష ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: