తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కొంత కాలం క్రితమే ఖుషి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయింది. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఖుషి మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ యువ నటుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే కుటుంబ కథా చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో విజయ్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను మొదటగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ మూవీ ని సంక్రాంతి కి కాకుండా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయాలి అనే ఆలోచనలకు ఈ మూవీ బృందం వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకు అనుగుణం గానే ఈ మూవీ షూటింగ్ ను కూడా ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు "యూ ఎస్" లో ఈ మూవీ షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: