ప్రతి వారం లాగానే ఈవారం కూడా కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాపడానికి రెడీ అయ్యాయి. అందులో భాగంగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

జిగరదండ డబుల్ ఎక్స్ : తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు తాజాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో రాఘవ లారెన్స్ , ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా రేపటి నుండి అనగా డిసెంబర్ 8 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది.

జపాన్ : తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తి హీరోగా నటించిన ఈ మూవీ లో అను ఇమన్యుయల్ హీరోయిన్ గా నటించగా ... రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 11 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో స్విమ్మింగ్ కాబోతోంది.

మరి ఈ రెండు మూవీ లకు "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: