
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు సినిమా ద్వారా.. టాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయమైంది హన్సిక. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులు చేసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో హన్సిక కెరియర్ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. కానీ ఎందుకో తనకు వచ్చిన క్రేజ్ ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. దీంతో చిన్నాచితక హీరోల సరసన కూడా నటించింది అని చెప్పాలి.
ఇక ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే హన్సిక యంగ్ గా కనిపించేందుకు పదహారేళ్ళ వయసులోనే హార్మోన్ల ఇంజక్షన్లు తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికి ఈ వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్లపై ఇటీవల హన్సిక స్పందించింది. నాపై వచ్చినవన్నీ రూమర్స్. అవన్నీ తప్పుడు వార్తలు. ఆ వార్తలు మా అమ్మను చాలా బాధించాయి. ఆమెను చూసి నేను కూడా ఏడ్చేశాను. సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. కానీ మరొకరి పర్సనల్ లైఫ్ గురించి ఏది పడితే అది రాయడం మాత్రం సరైన పద్ధతి కాదు అంటూ హన్సిక కామెంట్ చేసింది.