తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రగతి ఆంటీ కూడా ఒకరు ఈమె పలు సినిమాలలో నటిగా నటించిన ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఫోకస్ స్పోర్ట్స్ పైన ఎక్కువగా పెట్టారని తెలుస్తుంది. జిమ్ లో పెద్ద ఎత్తున కష్టపడుతూ భారీ స్థాయిలో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఈమె ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఏకంగా కాంస్య పథకాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పెద్ద ఎత్తున జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కుర్రాళ్లకు కూడా చెమటలు పట్టిస్తున్నారు.నాలుగు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తనని ఒక వ్యక్తి చిన్న వయసులోనే అమ్మను చేసారు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై ఆసక్తితో తాను ఇండస్ట్రీలోకి రావాలని భావించాను అయితే ఇండస్ట్రీలోకి తను హీరోయిన్గా అడుగు పెట్టాలని భావించగా ఒక వ్యక్తి తనతో మాట్లాడుతూ తన ఆలోచనలను మొత్తం చెడగొట్టారని ఈమె తెలియజేశారు.  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా కష్టం అలాగే అవకాశాలు వచ్చిన ఎక్కువ కాలం పాటు హీరోయిన్ గా కొనసాగలేరని అలాగే తల్లి పాత్రలలో కనుక చేస్తే ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగవచ్చు అంటూ నాకు సలహా ఇచ్చారు. ఇలా తనకు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలన్న కారణంతోనే ఈమె చిన్న వయసులోనే తల్లి పాత్రలలో నటించి తాను తల్లిని అయ్యాను అంటూ ఈ సందర్భంగా ప్రగతి ఆంటీ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె కెరియర్ మొదట్లో ఒకటి రెండు తమిళ సినిమాలలో హీరోయిన్గా నటించిన అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: